అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

22 Apr 2016

అతన్లోకి నింపబడదాం.

కవి యాకూబ్ -గురువుగారికి పుట్టినరోజు శుభాకంక్షలతో...

వెలుగుతున్న కాగాడాల దారిలో వెతుక్కుంటూ వుంటాం
నిన్ను నన్నూ
చూరు నుండి కారే చినుకులని చీల్చేసినా దొరకం
నువ్వు నేనూ
ఖాళీ దారుల్లో చెట్లు వెనక్కి వెడుతుంటాయి

నల్లగా పగలు మునిగిపోతున్నపుడు
విశ్వం వాకిలిముందు చెట్ల ఆకులలోంచి
రెక్కలు లేకుండా పద్యాలతో ఎగురుతుంటాం మిణుగురులై
మనల్నీ మనం వెతుక్కున్నాం.. 

అవునా..!!
లేదు...లేదు...
అక్కడొకానొక వ్యక్తి పూర్తీ కవిత్వం నింపబడిన వ్యక్తి
మనల్ని ఎగరేస్తున్నాడు
చూశావా అతన్ని పద్యాలతో నవ్వుతూ
పద్యాలని మనకిచ్చి ఎగరేస్తున్నాడు
ఎలాంటి గర్వం అది
ఎంత సాధారణంగా
మనకి మనం దొరికేవరకూ అలా ఎగరేస్తూనే ఉంటాడంటావా..!
మనం వేరొకరిని ఎగరేసేవరకేనట..?
మరింకే పదా పోదాం
అతన్లోకి ఒదిగిపోదాం, అతన్లోకి నింపబడదాం....

~సత్యగోపి
 మార్చి 2,2015 ,Facebook 
Satya Gopi

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...