అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Apr 2016

ముద్ద వారసత్వం

ఊరిలో అమ్మ 
వెలుతురిని కన్నతల్లికో ముద్ద

అన్నం ముద్దలెన్ని తిన్నానో 
జీవితాన్నే ముద్దుగా అందించిన నీ చల్లని చేతిగుండా,

అప్పుడెప్పుడో కన్నీళ్ళతో తల్చుకున్నా
మణికట్టుపై ముద్దుపెట్టావేమో
నా పదాలింత పదునెక్కాయని,
కవితనాన్ని యింటిపేరు చేసిన నిన్ను

అప్పుడప్పుడన్నా అవకాశమివ్వమ్మా
అన్నముద్దనే కాదు,
ఆప్యాయత ముద్దనీ నీ నోటికందించేందుకు
భరోసాల ఆనందాన్ని నీకు భద్రంగా అందించేందుకు
వెలుతుర్లోకి నన్నుతోసిన చేయి నీదేనని చెప్పేందుకు
నా బిడ్డల చేతిలో నాకోసం ఇలాక్కూడా
ఓ ముద్ద వారసత్వంలా దాచుకునేందుకు.

...................

~
కట్టా శ్రీనివాస్ 
3. 3. 2014
[అన్న పుట్టిన రోజు సందర్భంగా అమ్మకు మరోసారి నమస్కరిస్తూ....]

1 comment:

  1. అసలు తెలుగులో కవిత్వం చదివేవారికంటే చెప్పేవారి సంఖ్య ఎక్కువగాఉంది. ఎందుకు రాస్తున్నారో ఎవరు చదువుతున్నారో తెలియదు. ఈ వాదం ఆ వాదం అంటూ వేదన కలిగిస్తున్నారు. కవిత్వం వ్రాసే కంటే ఏదైన మంచిపనులు చేయవచ్చుకదా. వినరు సార్. విరుచుకు పడతారు. తిట్టిపోస్తారు. అలాగే రాసుకోండి సార్. నేను కవిని కాను అన్నవాడిని కత్తితో కాదు కలంతో పొడిచి చంపుతారు.

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...