అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

26 Jul 2011

తడిసి..తడిసి...

ఎప్పటినుంచో తడుస్తున్నాను 
ముద్దముద్దయి నన్ను నేను పిండుకుంటూ
ఇలా నిల్చున్నాను 

గుర్తులేదు కాని 
నాకంటే ముందునుంచే 
నా పుట్టుక -నాలోని విశ్వాసాన్ని లాక్కుంది.
నాకో అభద్రపు మతాన్ని జోడించింది.
సూటిగా కళ్ళల్లోకి చూసే దృష్టిని లాక్కుంది.
కాళ్ళకుఅంటిన మట్టిని భయభయంగా
తుడుచుకుంటూ,కడుక్కుంటూ
నడవాల్సిన దారుల్ని నాకోసం సిద్ధం చేసింది.

ఎన్నెన్ని వ్యూహాలో ...
ప్రతిసారీ విడదీసుకుంటూ సాగడం,
                 అలిసిపోకుండా చివరికంటా చేరడం...
ఎంత శక్తి హరించుకుపోయిందో ఇంత ప్రయాణంలో!
 
నా పేరు ఒక ప్రశ్న? నా ఊరు ఒక ప్రశ్న?
ఇంటి చిరునామా ఒక ప్రశ్న? 
రేషన్ కార్డు ఒక ప్రశ్న? పిల్లల పేర్లు ఒక ప్రశ్న?

ప్రతి అడుగునూ ప్రశ్నలవ్యూహాల్లోంచి  వేసుకుంటూ
రెండింతలశక్తిని  ఖర్చుచేసుకుంటూ  నీ పక్కన నిల్చోవడమే 
నేను సాధించుకున్న జీవితం.
నాకూ నీలాంటి ఓ మతాన్ని ఇవ్వు.
ఇన్నిసార్లు ఇలా
నన్ను నేను పిండి పిండి ఆరవేసుకునే బాధలోంచి
కొంచెం సేపైనా తప్పించుకుంటాను.

***

4 comments:

  1. enta kalaniki oka animuthyam chusanu malli. wonderful writeup sir.

    ReplyDelete
  2. నా పేరు ఒక ప్రశ్న? నా ఊరు ఒక ప్రశ్న?
    ఇంటి చిరునామా ఒక ప్రశ్న?
    రేషన్ కార్డు ఒక ప్రశ్న? పిల్లల పేర్లు ఒక ప్రశ్న?

    ప్రతి అడుగునూ ప్రశ్నలవ్యూహాల్లోంచి వేసుకుంటూ
    రెండింతలశక్తిని ఖర్చుచేసుకుంటూ నీ పక్కన నిల్చోవడమే
    నేను సాధించుకున్న జీవితం.
    నిర్దిష్టతకు మిరు చేరుకోగలిగారు అభినందనలు
    చేరుకొలేని వారి పరిస్థితి ఏమిటి మరొ ప్రశ్నగానే మిగులుతుంది

    మంచి ఆలొచనాత్మకమైన కవితను చదివాను అనే భావన

    ReplyDelete
  3. యాకూబన్నా.........అందరం బయట వర్షంలో తడుస్తూ వుంటే ...నువ్వేమో పొంగి పోరలుతున్న కవితలలో తడిసిపోతున్నట్టున్నావ్.... బాగుంది పద్యం....భాషాపరంగా ...అలాగే...వొక statement విషయంలో కూడా కొన్ని సందేహాలు ...(అ) భాషకు సంబంధించి..."అభద్రపు మతాన్ని"... అనడం అంగీకారమేనా? (ఆ) "నాకూ నీలాంటి ఓ మతాన్ని ఇవ్వు ".... వొక statement గా...భాషా పరంగా యిది అంగీకారమేనా...?

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...