అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

25 Jul 2011

ఇంకొంత మిగిలిన సందేహం

మిగిలింది నేనే ఇలా 

ఇంట్లో వేలాడకట్టిన గంటల్లోంచి
ఫ్యాన్ గాలికి విన్పించే సన్నని శబ్దంలా 
నేనే ఇలా 

వర్షంలోంచి తప్పించుకుని 
తల దాచుకునేందుకు ఏదో ఒక చోటు వెదుక్కుంటూ 
పరుగులు పెడుతున్న దూడలా 
నేనే ఇలా

ఓ చిరునవ్వుకు, ఓ ఆప్యాయతకు 
ఇంకొంచెం ప్రేమకు వెదుకులాడుతున్న మనిషిలా 
నేనే ఇలా 

నేను మలినం అంటని మాటల్ని  ప్రేమించాను 
మలినం నన్ను  ద్వేషించింది-
ప్రేమను ప్రేమతో ప్రేమించాను
అదేమో మాటల్ని ప్రేమించింది 

లోపలంతా నిజమైన మట్టిని నింపి 
సారవంతం అని నమ్మాను 
తీరా కొన్నాళ్ళకు అది కుళ్ళిపోయి 
నాకున్న నమ్మకమే అబద్దమని తేల్చింది.

చివరకు 
మిగిలింది నేనే ఇలా

***
(''లిఖిత'' 'శ్రీకాంత్ కు ప్రేమతో...)

10 comments:

  1. యాకూబ్;

    ఈ కవిత బాగుంది. మాటల బరువు ఇంకా వుంది. అవును, కవితలో చివరకి "మనమే మిగలాలి". శ్రీకాంత్ కవిత్వం నేర్పే పాఠం కూడా అదే!

    ReplyDelete
  2. కవిత చాలా బాగుంది. ఇస్మాయిల్ ప్రభావం కొంచెం కనిపించింది.

    ReplyDelete
  3. ప్రేమను ప్రేమతో ప్రేమించాను
    అదేమో మాటల్ని ప్రేమించింది ....

    ఎంత గొప్పగా చెప్పావన్నా....భాష ఎంతో తెలిసిన కవి అయినా సరే....'మాటలు....వుట్టి మాటలు....ఉత్తుత్తి మాటలు' రాకపోవడం వల్లే కదా ప్రేమ [అనుకున్నది] ప్రేమల్ని కాకుండా మాటల్ని ప్రేమించేది.....'ప్యాసా' లో గురుదత్ పోగుట్టుకున్నది కూడా అదే కదా...చివర్లో గురుదత్ కి ఏదో అసలైనదీ, విలువైనదీ దొరికిందని చూపిస్తారు గానీ....అది సినిమా లోనే సాధ్యం అనిపించేసింది కదా...

    ReplyDelete
  4. అఫ్సర్,born2perform ,కోడూరి,సుబ్రహ్మణ్యం గారు బోలెడు థాంక్స్,,..

    ReplyDelete
  5. Yakoob Kavee, చివరకు మిగిలింది నేనే ఇలా.. ఇంకొంత మిగిలిన సందేహంలా.. చాలా బాగుందన్నా నీ కవిత. జ్ఞాపకం ప్రవహించి వెళ్లిపోయిన తరువాత గులకరాళ్ళ నడుమ గాలి చేసే రొదలా.. తుడిచిన కన్నీటి కోసం అరిచేతుల్ని తడుముకునే దిగులులా.. చివరకు మిగిలింది.. మనమే ఇలా - అన్నట్లు ఈ బొమ్మ చూడు.. ఏడు రంగులు వెనక్కి పట్టకంలోకి వెళ్ళి ఒక్క తెల్ల రంగే అయినట్లు, నీ కవితకు వెనకాల మిగిలిన ఒంటరి వాక్యంలా.
    - pasunuru sreedhar babu

    ReplyDelete
  6. హృద్యంగా హత్తుకుంది...

    ReplyDelete
  7. ఓ చిరునవ్వుకు, ఓ ఆప్యాయతకు ఇంకొంచెం ప్రేమకు వెదుకులాడే మీ లాంటి కవుల శ్వాస వల్లే మనిషితనం ఇంకా పరిమళాన్ని పూర్తిగా వదులుకోలేదనుకుంటాన౦డీ!

    ReplyDelete
  8. wah janaab bahuth khoob hai aap ki shayaree....nd the blog oh god mind blogging ......u re great sir....love j

    ReplyDelete
  9. chala hrudyangaa undi sir....

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...