అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

5 Jun 2014

సృష్టి

 
.....................

విత్తనం ఇచ్చాను 
అక్కడొక వనం మొలిచింది 

ఒక పిల్లంగోవినిచ్చాను 
అక్కడంతా సంగీతం పలుకుతోంది 

కొన్ని పదాల్ని వెదజల్లాను
జీవితం కాగితాల్లోంచి ప్రవహించింది

రేపు నన్నే ఇస్తాను
అక్కడ సంతోషం విస్తరించాలి.

11.1.2014

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...