అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

5 Jun 2014

ఇవాళ

.........................

కలలు కంటాం. మెలకువలోని మెళకువలుగా లోపలెప్పుడూ నిక్షిప్తంగా అవి దాక్కునే వుంటాయి. మనమేమిటో నిజమేమిటో, అబద్దమేమిటో అంతా వాటికి తెలుసు. వాటికే తెలుసు. అసలు జీవితంలోని సగంభాగం, ఇంకా ఎక్కువ అవే .
ఊపిరాడని సందోహం మధ్యన పరుగులు పెడుతున్నప్పుడు ,అవి మనలోపలి నిద్రలోంచి కళ్ళు తెరిచి అన్నీ గమనిస్తూ ఉంటాయి. బహుశా నిద్రలో దాక్కున్నప్పుడు మనం ఉన్నా లేనట్లేనేమో.


మనిషి అసలు స్వరూపం బయటికి వస్తున్నప్పుడు, ఎవరైనా గమనిస్తున్నారని తెలియడమే నిజమైన శిక్ష. అబద్దపురూపం కరిగి అసలుసిసలుతనం వెలికివచ్చేసమయాలు కలలు ఉరివేసుకునే క్షణాలు.


2
నిన్నటిలా ఇవాళలేనట్లే, రేపు అసలే ఉండదు.
అయిందేదో అయింది, అంతా ఇలానే అవుతుంది. కలలు కనడం మాత్రం మానలేం. అవి మాత్రమే మనం- నువ్వూ నేనూ .
కలలు కందాం.ఇవాల్టిలాగే ,రేపు కూడా !


*1.6.2014

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...