అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

30 Nov 2011

వల




మనిషిని భూమి నమ్మక చాలాకాలమైంది

నిజానికి నేలపైన మాయవలలు తప్ప
గింజలే కన్పించని కాలంలో
పక్షులు గింజల కోసం భూమ్మీద వాల్తున్నాయి
పక్షుల  మీదా
గింజల మీదా
పెత్తనం కోసం
ఇప్పుడు కొత్తగా రుతువుల జాబితాలో
వలల రుతువు

వలల్ని ఎత్తుకుపోయిన
పక్షుల కథలు తప్ప
మరేమీ తెలీని రైతు
సరికొత్త బోయవానికి
రైతు కన్నా గింజలంటేనే అతి ప్రేమ!!

1.
రైతుకి మారుపేరు తాకట్టు

దూరమైన మాటలూ, విన్పించని విలుపులూ
అన్నీ పనిముట్లైన ఈ పూట
గుంటకలూ
జడ్డిగమూ
నాలుక మీంచి ఎగిరిపోతుంటే
తలపైని కప్పుబిత్తరపోతోంది!!
వంకర జాతకాలు
సంకర గింజలూ
సర్పయంత్రాలూ
వెరసి ఈ దేషానికి వెన్నెముకరాజు
చెదలు పట్టిన నిలువెత్తు వొంటరి దిక్కులేని చెక్కస్తంభం

మానవీయ సంబంధాలు
డాలర్ అలంకారాల్ని పులుముకొంటుంటే
రైతు ప్రకృతిలోంచి యంత్రంలోకి వొదిగిపోతున్నాడు.

మనిషినీ
భూమినీ
ప్రకృతినీ
దగాచేసే వలల్ని నమ్మక
ఇప్పుడు తన స్వేచ్చకోసం కాలమే నినదిస్తుంది
భూమికి ఇప్పుడు స్వేచ్చ కావాలి!!
***

2 comments:

  1. మనిషిని భూమి నమ్మక చాలాకాలమైంది...

    నిజమే సార్...ఎవరు ఎవరిని మోసం చేసుకుంటున్నారో తెలీకుండా కాలికింద నేల పరాయిదైపోతుంది..బతుకు భుజాన కావిడి కుండలా మారుతోంది....

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...