అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

28 Nov 2011

లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను




మానుతున్న గాయాన్ని మళ్లీ ఎవరో కెలికారు
ఎవరో స్వేచ్చను యాభై ఏళ్లలోపే పరీక్షకు నిలబెట్టారు
మేకప్పుల్తో సహా మనుషులందరూ
మళ్లీ  వెనక్కి రూపాంతరం చెందారు

రోడ్ల మీద నడుస్తున్నవాళ్లూ
కుడిఎడమలకు సర్దుకున్నారు
పేర్ల వెనక మతాల ఐడెంటిటీ గుర్తులు తగిలించుకుని
అందరూ అప్రమత్తులై పోయారు
మూడు గోపురాలు మూడు సింహాలు
మూడు రంగులు ప్రశ్నార్ధకాలుగా మారిపోయాయి.

అన్ని ప్రతీకలు మరోసారి వంచించబడ్డాయి.

మతనిర్ధారణ కోసం ప్రత్యేక నిర్ధారణ  కమిటీలు  నియమించబడ్డాయి
చరిత్ర పేజీల్లోంచి మనిషి ఆనవాళ్లు తప్ప
శిధిలాల్నే ప్రమాణాలుగా చూస్తున్నారు
మనిషే అన్ని శిధిలాల్లోంచీ ఆస్థిపంజరమై వెలికి వస్తున్నప్పుడు
మనిషి తప్ప మిగిలిన సమస్యలే ప్రధానమై పోతున్నప్పుడు
మత చదరంగంలో మనుషులే పావులవుతారు!

1.
రాజులు రాజ్యాలు అంత:పురాలు
కాలం పరీక్షించి వదిలేసిన  జ్ఞాపికలు
కాలం వెంబడించిన ప్రతి వస్తువు పరివర్తన చెందుతుంది
విలువలు మారతాయి. అవసరాలు మారతాయి
మనిషే మారతాడు

కాని ఇప్పుడు అవరోహణ క్రమంలో
మనిషి ప్రయాణించడం ఎంత చోద్యం
ప్రతి  మనిషిని శత్రువుగా చిత్రించి
ప్రతి గుండె మీద అపనమ్మకాల పరదాలు కప్పి
భయాన్ని నిత్యావసరంగా మార్చి
అన్ని మానవతా విలువల్ని కాలరాచి
ఏ రథాల మీదో రామబాణాల మీదో  రాతియుగందాకా
తిరుగు ప్రయాణం కట్టిన ఆదిమానవుల్ని చూస్తున్నానిప్పుడు
మనిషిని వెంటాడుతున్న ఉన్మాదాల సాక్షిగా
నిజానికి ముక్కలై పోతున్నాది మనిషే
మనిషి కథ నిజం కానప్పుడు
కల్పిత గాధలే భూగోళాన్ని చుట్టుకుంటాయి

2.
ఊపిరి పోసుకోక ముందే మనిషి మతాన్ని నిర్ణయించే భూమ్మీద
నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే  ప్రయత్నం చేస్తున్నాను

నేనే ఒక కట్టడాన్ని నన్నెవరు కూల్చడానికి ప్రయత్నించినా
నేను మనిషిలా ప్రశ్నిస్తాను
ప్రతిసారీ నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను.

7 comments:

  1. excellent write up....very thought provoking and intense sir...
    Vijaya Bhanu Kote.

    ReplyDelete
  2. ధీరోదాత్తమైన కవిత...చాలా హత్తుకుంది సార్...

    ReplyDelete
  3. నేనే ఒక కట్టడాన్ని నన్నెవరు కూల్చడానికి ప్రయత్నించినా
    ఒక మనిషి లా ప్రశ్నిస్తాను
    Excellent write up Sir !!!!

    అద్వానీని క్షమార్పణలు చెప్పమనేది అందుకే, ఇంటి దగ్గరకెళితే పట్టుకుని దులపవచ్చు, కానీ నాకు లైవ్ లో దొరకాలి. ఎప్పుడు దొరుకుతాడా అని ఎంతో ఆశతో చూస్తున్నాను. అలా దొరికిన రోజున మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేనే చెపుతాను. అంత వరకూ వేచి చూడండి.

    మహేష్ ,

    మీకు ఈ కవిత మీద కమెంటే అర్హత లేదు, మీరే ఒకసారి సీతని నా ముందే అవమానించారు. ఇతరుల మనోభావాలను,నమ్మకాలను గాయపరిచే అధికారం మీకు లేదు. కట్టడం అయినా మనిషి అయినా ఒకటే నా దృష్టిలో... ఎవరు కూల్చడానికి ప్రయత్నించినా నేను ప్రశ్నిస్తాను.

    ReplyDelete
  4. @నీహారిక: నేను దేనిమీద కామెంటాలో కామెంటకూడదో మీరు నిర్ణయిస్తే ఎలాగా! Please mind your business.

    ReplyDelete
  5. మిత్రులారా !
    ధన్యవాదాలు.
    మీ స్పందనలు ఇంకాస్త శక్తిని పెంచాయి నా కలానికి.

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...