అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

18 Nov 2011

మాట్లాడని మాటలు



మనం కలిసినప్పుడల్లా
ఏమీ మాట్లాడకుండానే మిగిలిపోతాం

అన్నిసార్లు మిగిలిపోయేదే ఎక్కువ
నిజానికి మీరు నేనూ ఎన్నోవేలసార్లు కలుసుకున్నాం
మాట్లాడవలసిందేదీ మాట్లాడకుండానే విడిపోయాం
మీ ఇంటికబుర్లు, మా ఇంటికబుర్లు
నడుమ నడుమ నిశ్శబ్ధమే హరించిన ఎన్నో వందల నిముషాలు
వెరసి మనం మాట్లాడిందేదీ మనం మాట్లాడదలుచుకున్నది కాదు.

అప్పుడెప్పుడో మనిద్దరం ఒకరి కళ్ళలో ఒకరం
భవిష్యత్తును గీసుకుంటున్నప్పుడు
గొంతు దాటకుండా మనం మిగిల్చిన మాటలే ఇప్పటికీ వేధిస్తుంటాయి
మనిద్దరం మనవి కాని పంజరాల్ని నిర్మించుకున్నాం
అందర్నీ సంతోషపెట్టాం.
"మీరు బాగున్నారా! మీ పిల్లలూ .. కులాసేనా?"
ఇంతకు మించి మాటలు లేవు
ఈసారి కలుసుకున్నప్పుడైనా మనసు విప్పి మాట్లాడుకుందాం


అన్నట్లు మీ కళ్ళ క్రింద నల్లటి చారలు
ముఖంలో తారట్లాడే నల్లటి మబ్బులాంటి దిగులు
వాటి గురించైనా చెప్పరు మీరు
కలల్లోనూ బతకాల్సిన బతుకుని కలగనలేని మనం
ధైర్యంగా అర్ధాలు విడమర్చి చెప్పుకోలేం
అయినా లోపలి మాటలు నన్ను ఎప్పుడు బాధపెడుతుంటాయి
ఈసారి కలసినప్పుడైనా మనలోని మాటల్ని మాట్లాడగలమా?

11 comments:

  1. excellent poem yakub sir......it s really touching....no words to say anything.....love j

    ReplyDelete
  2. excellent .. may be only friends really care for us...

    ReplyDelete
  3. "నడుమ నడుమ నిశ్శబ్ధమే హరించిన ఎన్నో వందల నిముషాలు
    వెరసి మనం మాట్లాడిందేదీ మనం మాట్లాడదలుచుకున్నది కాదు."
    చాలా బావుంది.

    ReplyDelete
  4. మనిద్దరం మనవి కాని పంజరాల్ని నిర్మించుకున్నాం
    అందర్నీ సంతోషపెట్టాం...hmm అదే జీవితాన్ని చేసుకున్నాం. good poem

    ReplyDelete
  5. "గొంతు దాటకుండా మనం మిగిల్చిన మాటలే" అసలి ససలు కవిత్వం చదువుతున్న భావన...ఎప్పుడో ఎక్కడో కాని ఇలాంటి వాక్యాలు కనపడవు...యాకూభ్ జీ బహుత్ ఖూబ్---వాసుదేవ్

    ReplyDelete
  6. ఈ అనుభవం నాకూ చాలాసార్లు జరిగింది
    మాట్లాడంకోసమే కలుసున్న క్షణాలను
    ఏవేవో పొరలపొరల అసందర్భాలు చొరబడి
    తీరని ఆకలి
    మాట్లాడకుండానే విడిపోయిన సమయాలు

    కళ్ళముందు కదలాడాయి....

    ReplyDelete
  7. థాంక్యు...జ్యోతి గారు,జ్యోతిర్మయి గారు,వాసుదేవ్ గారు,గంగాధర్ వేంపల్లి గారు,ప్రవీణ గారు,వాసుదేవ్ గారు, జాన్ హైడ్ గారు....
    మీ అభిమానానికి క్రుతజ్నతలు..!

    ReplyDelete
  8. కొన్ని సార్లు మాటల కన్నా మౌనమే ఎక్కువగా సంభాషించడం నాకు అనుభవమే. ఆ నిశ్శబ్ద శబ్దంలో ఎక్కడో చెలరేగుతున్న అలజడి అలికిడి ఇరు హృదయాలకూ పరిచయమైనదే...కానీ ఆ ఎదరొద ఏ ఒక్క ఎడద దప్పికా తీర్చలేనపుడు....మౌనం....సమాధానం...మీ కవితతో అది మరోసారి రూజువఈమ్ది యాకూబ్ జీ....ధన్యవాద్.....

    ReplyDelete
  9. తాంక్యు స్పూర్థి గారు.!

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...