అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

27 Jun 2011

రహాస్యం



పక్షి ఆకాశాన్ని చుడుతుంది
తన రెక్కలచట్రం లోకి ..
          రెక్కలు దాని ఆత్మవిశ్వాసం !

కొమ్మలు ఆకాశాన్ని
పగలనకా రాత్రనకా అలా చేతులు చాచి
పిలుస్తూనే ఉంటాయి
          వాటి కళ్ళల్లో ఆకుపచ్చని ఆత్మవిశ్వాసం !

సంవత్సరాలు కాలాన్ని
ఎడతెగక  వెం.. బ.. డి.. స్తాయి...
           జీవితం వాటి ఆత్మవిశ్వాసం
 ****
కదిలితే మెరుపులా మెరిసే
ఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం...
#*#
 2009

                                       

3 comments:

  1. కదిలితే మెరుపులా మెరిసే
    ఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం..
    అద్భుతం సార్...కవితా సంకలనంలో చదివాను ...ఇక్కడ మరో మారు చదవడం బాగుంది....

    ReplyDelete
  2. "కదిలితే మెరుపులా మెరిసే
    ఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం..." మెరుపులాంటి ముగింపు సర్, అద్భుతమైన కవిత..ధన్యవాదాలు!

    ReplyDelete
  3. mmmm wah shayar jee bahuth khoob hai aap kee blog ......pyarse....j

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...