అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

14 Dec 2011

తడి



పువ్వుల లోపల నిద్రిస్తున్నవాడికి
ఇంద్రధనుస్సుల అవసరమే రాదు

ఆకుల పచ్చదనాన్ని నింపుకున్నందుకు
చిగురింతల తక్షణత` ఉండదు

మేఘహృదయంతో చెమ్మగిల్లేవాడికి
మళ్లీ మెరుపులా మెరిసే అవసరమే రాదు

స్వచ్చమైన నదిలా ప్రవహించేవాడికి
రాళ్ల అడ్డంకుల్ని నీటిలా దాటడం తెలుసు

నెత్తుటి స్వరమై ఉప్పొంగే వాడికి
బతుకు తడి పరిచయం అనవసరం.

ప్రేమనే నిర్వచించినవాడికి
మళ్లీ గాయాల చరిత్ర గురించి తెలపడం అనవసరం
#*#

2 comments:

  1. "మేఘహృదయంతో చెమ్మగిల్లేవాడికి
    మళ్లీ మెరుపులా మెరిసే అవసరమే రాదు"... కవిత చదువుతుంటే ఓ తెలీని భావం చుట్టుముడుతోంది. నిజంగా చాలా బాగుందండీ యాకూబ్‌గారూ...

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...