అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

11 Jul 2014

ఎవరు ఓదార్పులై కూర్చునేరు..?!




దుఃఖితుడా
నీ శోకాల నెవరు అడిగేరు?  నీ లోకాల నెవరు తడిమేరు?
నీ లోలో ఎవరు ఓదార్పులై కూర్చునేరు?

ఎచటికి పోతావీ రేయి
నీ లోపలి కలుగుల్ని ఎలా తడుముకుంటావు
అజంతావజీరహ్మ 'మో' బైరాగంలో
శ్రీశ్రీ ఇస్మయి లాపనల్లో
బైరాగివై బంధీవై శివసాగరుడవై
ఎచటినుండి ఎటకెగుతావు
'అన్నిటికీ కారకుడు మనిషి కనుక
ప్రతిమనిషిలో నన్ను చూసుకోవడం నాకెంతో యిష్టమని'
ఏ వెన్నులోని తూటాతో పెనవేసుకుని నిద్రపోతావు
'తుఫాను తుమ్మెద'ల పాటదండుల, రేలారేలాల
గద్దరు, రాజ్యమూ, మేమూ'ల సమిష్టి ప్రతీకల్లోంచి
చిరిగిన ఎర్రటి వస్త్రాన్ని తిరిగి తెచ్చుకోగలవా?

నల్లటి మొహరం విషాద ప్రతీకల
జనన విషాదం చేతపట్టుకుని
ఇక అణచబడ్డ స్వప్నాల అంతరార్ధాల గురించి మాట్లాడాలి.

స్వాప్నికుడా!
సమీపాలు - నీ విసర్జించిన సుఖం
సమీపించిన దు:ఖమే నిజమైన కవిత్వం

8 comments:

  1. బాగుంది ... ఎక్కడెక్కడో తడిమింది
    అభినందనలు

    ReplyDelete
  2. @జాన్ హైడ్ గారు
    @కెకూ బ్ వర్మ గారు
    @రోహిత్ & ఎం.ఎస్.నాయుడు!
    ఈ కవిత నచినందుకు థాంక్స్..

    ReplyDelete
  3. "సమీపించిన దు:ఖమే నిజమైన కవిత్వం" ఎప్పటిలా కొన్ని వాక్యాలు వెంటాడే భావనలు. బావుంది సర్.

    ReplyDelete
  4. manchigunnadi bhavamu yakub saroo ....love j

    ReplyDelete
  5. @vssudev
    @dhaathri gaaru.!
    thanks...................

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...