------------
ఈ రాత్రిని కొలవాలి
ముసురుపట్టిన ఈ రాత్రిలో
ఇంకిన వర్షపుచినుకుల్లో తడిచి వణుకుతున్న
రాత్రిదేహాన్ని కొలవాలి.
1
దుఃఖపుజీర అంటిన కాలపుచెక్కిలి మీద
స్ఫోటకం మచ్చలా నిద్రిస్తున్న రాత్రి;
పగలంతా అలిసి ,ఇల్లంతా తిరిగి తిరిగి విసిరేయబడ్డ
మసిగుడ్డలాంటి రాత్రి;
2
=మరలాంటి రాత్రి ,కాలి ఆరిపోయిన కొరకాసులాంటి రాత్రి=
కొలవగా కొలవగా మిగిలిపొయిన రాత్రిని
కల లో ప లి ర హా స్యా ల లోంచి కొలవాలి .
chakkaga raasaaru,
ReplyDeleterathri ni kolavadam , entha chakkni alochana....
కొత్త నిర్వచనాలు...
ReplyDeleteచాలా బాగుందండీ!
@శ్రీ