అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

5 Jun 2014

లోపలి మైదానం

................................
రోజూ ఏదో ఒకటి తెలుస్తూనేవుంటుంది,కొత్తగా ఏదో 
నేర్చుకున్నట్లుగానే ఉంటుంది,మరీముఖ్యంగా నాగురించి నేను.
ఒకరిద్దరైనా కలుస్తారు .వాళ్ళు నాలోకి ,నేను వాళ్లలోకి
వెళ్లి కూచున్నాక అక్కడికిక ప్రయాణం ముగుస్తుంది.

*
ఆతర్వాత ముగిసినరోజుని లోపలి మైదానంలోకి అలా అలా తిరిగేందుకు 
పంపిస్తాను.కన్నీళ్లుగానో,బిగ్గరగా నవ్వుకునే నవ్వులగానో, లోపలికే ముడుచుకున్న
నిన్నటిలాంటి అనుభవంగానో
- ఆ మైదానంనిండా ఎత్తుపల్లాల గుంతలు.

*
ఆ తర్వాత అలిసి,సేదతీరి,కలగలిసి,విడివడి వొంటరిగా మిగిలాక :

వస్తూపోతూవుండే కరెంటుకు వెలిగి
ఆరిపోయే బల్బుగురించి
ఎవరో ఒకరు ప్రస్తావిస్తుంటారు .
*
30.3.2014

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...