ఒకానొకరోజు నాలో ఒక అక్షరం మొలిచింది.
అప్పుడు నేను గొర్రు తోలుతున్న మా నాన్న పక్కన
చేనులో వున్నాను.
మొలుస్తున్న ఆ క్చణాలఅనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నా ,
నాలో నేను అలా నాగటిచాలులా సాగిపోతూనే ఉన్నా.
ఈ మధనం ఎలా గుర్తిన్చాడో నాన్న
గొర్రు ఆపి నన్ను దుగం మీద కూచోపెట్టి
'నీలో ఏం జరుగుతోంది బేటా!'తల నిమురుతూ అడిగాడు.
నాలోపలి అక్షరపు మొలక గురించి చెప్పాను
విచ్చుకుంటున్న దాని రెమ్మల గురించి వివరించాను
మొలకలోని రంగుల గురించి వర్ణించాను
వోపిగ్గా నా వైపే చూస్తూ
నా ముఖంలో మారుతున్న వెలుగుల్ని
గమనిస్తూ వీపు నిమిరాడు.
తలపైన జుట్టు సరిచేశాడు
నాకు ఈ విద్య తెలుసు
నా చిన్నపుడు నాలో ఈ విద్య మొలిచింది.
నీలోనేమో అక్షరం మొలిచే విద్య మొలిచింది"
నాలోని ఈ విద్యను నమ్ముకున్నాక
మన ఇంట్లోకి గింజలు రావడం మొదలైంది
నువ్వు నీ అక్షరాన్ని నమ్ముకో!
అక్షరం నిన్ను గింజగా మారుస్తుంది.
మొలకెత్తుతూనే ఉండు
పచ్చ పచ్చగా అందర్నీ పలకరిస్తూనే ఉండు,
నువ్వొక పంటపోలంలా మారు.
నీ ఇంట్లో అక్షరాల గుమ్ములు నేను చూడాలి
నేను,మా నాన్న ఇద్దరం
ఇన్నాళ్ళు గింజల గురించి వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాం
ఆరునెలల నుంచి నాతో మాట్లాడానికి
నాన్న ఇక్కడ లేడు,పొలం దగ్గరా లేడు
వెతుక్కుంటున్నాను
నాలోపలి అక్షరాలతో మొరపెట్టుకున్తున్నాను
అప్పుడు నేను గొర్రు తోలుతున్న మా నాన్న పక్కన
చేనులో వున్నాను.
మొలుస్తున్న ఆ క్చణాలఅనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నా ,
నాలో నేను అలా నాగటిచాలులా సాగిపోతూనే ఉన్నా.
ఈ మధనం ఎలా గుర్తిన్చాడో నాన్న
గొర్రు ఆపి నన్ను దుగం మీద కూచోపెట్టి
'నీలో ఏం జరుగుతోంది బేటా!'తల నిమురుతూ అడిగాడు.
నాలోపలి అక్షరపు మొలక గురించి చెప్పాను
విచ్చుకుంటున్న దాని రెమ్మల గురించి వివరించాను
మొలకలోని రంగుల గురించి వర్ణించాను
వోపిగ్గా నా వైపే చూస్తూ
నా ముఖంలో మారుతున్న వెలుగుల్ని
గమనిస్తూ వీపు నిమిరాడు.
తలపైన జుట్టు సరిచేశాడు
"నేను చేనంత దున్ని గింజలు చల్లాల
వానలు పడ్డాక మొక్క మొలుస్తుంది,పంట పండుతుంది .నాకు ఈ విద్య తెలుసు
నా చిన్నపుడు నాలో ఈ విద్య మొలిచింది.
నీలోనేమో అక్షరం మొలిచే విద్య మొలిచింది"
నాలోని ఈ విద్యను నమ్ముకున్నాక
మన ఇంట్లోకి గింజలు రావడం మొదలైంది
నువ్వు నీ అక్షరాన్ని నమ్ముకో!
అక్షరం నిన్ను గింజగా మారుస్తుంది.
మొలకెత్తుతూనే ఉండు
పచ్చ పచ్చగా అందర్నీ పలకరిస్తూనే ఉండు,
నువ్వొక పంటపోలంలా మారు.
నీ ఇంట్లో అక్షరాల గుమ్ములు నేను చూడాలి
నేను,మా నాన్న ఇద్దరం
ఇన్నాళ్ళు గింజల గురించి వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాం
ఆరునెలల నుంచి నాతో మాట్లాడానికి
నాన్న ఇక్కడ లేడు,పొలం దగ్గరా లేడు
వెతుక్కుంటున్నాను
నాలోపలి అక్షరాలతో మొరపెట్టుకున్తున్నాను
" నాలోపలి నాన్నని అక్షరంగా మలిచి నాకివ్వవా!"అని .
అన్నా...
ReplyDeleteముందుగా వొక మాట...
బ్లాగర్ వి అయినందుకు శుభాకాంక్షలు...
పద్యం చాలా బాగుంది...ముఖ్యంగా ...
"మొలకెత్తుతూనే ఉండు
పచ్చ పచ్చగా అందర్నీ పలకరిస్తూనే ఉండు,
నువ్వొక పంటపోలంలా మారు.
నీ ఇంట్లో అక్షరాల గుమ్ములు నేను చూడాలి ".....కదిలించివేసిన పాదాలు ....
హలం పట్టి ఆరుగాలం శ్రమించిన తండ్రులందరూ కలం పట్టిన తమ కొడుకుల గురించి కన్న కలలన్నీ ఇవేనేమో..
అబ్బాయిల విషయంలో తొలి సంస్కారం తండ్రి నుంచే అబ్బుతుందని నేను కొంత మేర నమ్ముతాను...
నా ఇంకొక అనుభవం ఏమిటంటే ....మన వయసు పెరిగిన కొద్దీ మన తండ్రి మనకు ఎక్కువగా అర్థమవడం మొదలవుతుందనీ...బహుశా, అక్కడి నుంచీ మనం ముందు కన్నా తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తామని..
" నాలోపలి నాన్నని అక్షరంగా మలిచి నాకివ్వవా!" అని మీరు మొరపెట్టుకున్నారు గానీ..
మీ ఈ పద్యంలో మీ తండ్రి కనిపించాడు నాకు...బహుశా, అందరికీ కనిపిస్తాడనే అనుకుంటున్నా......
thank u..
ReplyDeleteమీరు ఇన్నాళకు బ్లాగులో రాస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది
ReplyDeleteఅందుకు అభినందనలు
అక్షరదోషాలను పోస్టుచేసేముందు ఒకసారి గమనించి పోస్టు చెయ్యండి
haid garu...ok
ReplyDeleteయాకూబ్ .. నీలో మొలకెత్తిన అక్షరమే మీ నాన్న కదా. మీ నాన్నే నువ్వు కదా. నువ్వూ నాన్నా అక్షరమూ అంతా వొక్కటేనేమో. నీలో నువ్వే నీ కోసం వెతుక్కుంటున్నావేమో. బావుంది మిత్రమా . తొలకరి తొలి చినుకు పడినప్పుటి పల్లెవాసనలా బావుంది.
ReplyDeleteఆరునెలల నుంచి నాతో మాట్లాడానికి
ReplyDeleteనాన్న ఇక్కడ లేడు,పొలం దగ్గరా లేడు
వెతుక్కుంటున్నాను
యాకూబ్:
ఆ మూడు లైన్లు నీతో వున్నంత కాలం నీలోపల కొత్త కవిత్వపు గింజలు వున్నట్టే.
thanks friends
ReplyDeleteyakub gaaru
ReplyDeletemee yedategani prayaanamlo chikkukunE unnaanu ippaTikee...
with love
bollojubaba
Hi yaar,
ReplyDeletepoem livelygaa undi. yentho ardram gaa undi.
Gudipati
superb....sir..love j
ReplyDeleteevarainaa nammukovalsina ginjalento chala baga chepparu shayarjee....mee blog vinyasalu chaaaala blagunnayi....marinth kavithvam lo sahithee jagathini olaladinchandi....love j
ReplyDelete