వొక వసంతపు పగలు
రెక్కలల్లార్చిన సీతాకోకచిలుకలు,నవ్వుతూ పూలు
నేనో వాయులీనాన్ని
సితారాను,వేణువును...
గాలి నా నుంచి వీచడం నేర్చుకుంది
తంత్రి నెమ్మదినెమ్మదిగా నన్ను లోబర్చుకోవడం మొదలు పెట్టింది
చేతివేళ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి
నాకే తెలియని కదలికలతో ...
వసంతపు పగలు ఆవరించి
ఉక్కిరి బిక్కిరి చేసిన సంగీతం
కళ్ళల్లోకి వరుసగా దృశ్యమాల
చెమర్చిన చూపులోకి తొంగిన ఇంద్రధనుస్సు !
శ్రుతిచేసి ఉన్నాను
ఇక వసంతాన్నే విన్పిస్తాను..
#*#
No comments:
Post a Comment