ఉన్నదొకటే జన్మ
నవ్వినా ఏడ్చినా
ఓడినా పోరాడినా సుఖించినా దుక్కించినా
ఉన్నదొకటే జన్మ!
ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు ,
కాగితాలకు చేరుకునే దారుల్లో పయనిస్తున్న పదాలు,
నొప్పెట్టే పాదాలతో రాత్రుల్ని ఈదే
దేహాల తీరనితనం ...
ఎవరైనా అడుగుతారా? ఏమైనా తెస్తారా?
ఇంకేం ఇస్తారు ?ఇంకేం అడిగి ఇచ్చి వెళతారు?
ఒక జన్మే తిరిగి రాదు
తిరిగి మరల రానే రాదు
2009
'' సరిహద్దు రేఖ "
No comments:
Post a Comment