పక్షి ఆకాశాన్ని చుడుతుంది
తన రెక్కలచట్రం లోకి ..
రెక్కలు దాని ఆత్మవిశ్వాసం !
కొమ్మలు ఆకాశాన్ని
పగలనకా రాత్రనకా అలా చేతులు చాచి
పిలుస్తూనే ఉంటాయి
వాటి కళ్ళల్లో ఆకుపచ్చని ఆత్మవిశ్వాసం !
సంవత్సరాలు కాలాన్ని
ఎడతెగక వెం.. బ.. డి.. స్తాయి...
జీవితం వాటి ఆత్మవిశ్వాసం
****
కదిలితే మెరుపులా మెరిసే
ఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం...
#*#
2009
కదిలితే మెరుపులా మెరిసే
ReplyDeleteఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం..
అద్భుతం సార్...కవితా సంకలనంలో చదివాను ...ఇక్కడ మరో మారు చదవడం బాగుంది....
"కదిలితే మెరుపులా మెరిసే
ReplyDeleteఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం..." మెరుపులాంటి ముగింపు సర్, అద్భుతమైన కవిత..ధన్యవాదాలు!
mmmm wah shayar jee bahuth khoob hai aap kee blog ......pyarse....j
ReplyDelete