మా ఇంట్లోకి కొత్త ప్రపంచాన్ని మోసుకొచ్చింది
అది పూలుపూయడం నేర్చుకున్న దగ్గరినుంచి
అన్నీ చిత్రాలే !
దాని వెంట కిచకిచలాడుతూ పలకరించే
చిన్ని చిన్ని పిట్టలు
సద్దుచేసే
పరిమళ భరితమైన గాలి ,
తలలూపే ఆకులు,తుమ్మెదల రొద
ఇల్లంతా పండుగ సంరంభం
పెరట్లోంచి ఇంట్లోకి రాయబారిలా
ఈ పూలచెట్టు తొంగిచూస్తూ మమ్మల్ని మాకే
సరికొత్తగా పరిచయం చేస్తుంది
పరిమళాన్ని వెదజల్లి పిట్టలదో, తుమ్మెదలదో మనసుదోచుకున్నట్టు
ReplyDeleteఅక్షరాలు వెదజల్లే పరిమళమేకదా కొత్తబంధాన్ని కూర్చేది.
అదే కదా కవిత్వం చేసేది
చాలా బాగుందండి
ReplyDelete