అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

8 Aug 2011

చెప్పలేని జవాబు

సాయంత్రం వాడితో కూచుని 
'ఎలా ఉన్నావురా ' అని ప్రేమగా అడిగాను.

'బాగోలేను డాడీ' అని వాడి సమాధానం ..
'అదేమిటీ-బాగుండకపోవడానికి నీ సమస్య ఏమిటి?'
'మీరే డాడీ!'
'నీకోసమే కదా నా ఈ శ్రమ,కష్టం..'
'నువ్వు చదువుకోవడానికి నీకంటూ ఒక రూమూ,సదుపాయాలూ ,
నీకోసం అనుక్షణం ఆలోచించే అమ్మా నేనూ అన్నయ్య 
నీకేం లోటు నాన్నా!?'

'నన్ను ఏ విషయంలోనూ కోపపడవద్దు,
నాతో ఎప్పుడు శంకించినట్లు మాట్లాడవద్దు ,
నా గురించి నాకు తెలుసు,నన్ను నేను నిర్మించుకోగలను'
'నాతో ప్రేమపూర్వకంగా మాట్లాడండి,నాతో కలిసి గడపండి.
హడావుడుల పరుగులకంటే మీతో నేను గడిపే క్షణాలు ముఖ్యం.
మీరే ముఖ్యం . '

 ***
 ఇన్నాళ్ళ నా జీవితపు పనిముట్లు 
 ఏం నిర్మించాయి,ఏం కూల్చేసాయి ....
వాడు మాట్లాడే ప్రేమలో 
నేను అనుకుంటున్నప్రేమలో
అందని భావార్ధం ఏదో మిగిలిపోతోంది .

అవసరాలు ,అందని ద్రాక్షపళ్ళలాంటి జీవితం 
తీరిగ్గా కూచోనీయని కాలం 
నన్ను నిలువెల్లా దహించిన ప్రేమరాహిత్యం 
రెక్కాడితే కాని డొక్కాడని నేపధ్యం
ఒంటిపైన ఒక చొక్కావిప్పితే ఎలాగోనన్నఅరకొరతనం 
ఏదో ఒకటి చదువే కదా -అని 
హాస్టల్ సీటు మాత్రమే ప్రధానం అనుకున్న సర్దుబాటుతనం

ఇవన్నీ ఎలా అర్ధం చేయించను -నా ప్రేమంతా 
నా కొడుకు నాకులా కాక 
అన్ని సౌకర్యాలమధ్య ఎదగాలని పడుతున్న శ్రమలోనే ఉందని..!

 నా ప్రేమ 
తన ప్రతి కదలికను గమనిస్తూ  
గర్విస్తున్న నా మనసులో ఉందని--!!


3 comments:

  1. revalation of today's papa.....well presented...love j

    ReplyDelete
  2. యాకూబ్ జీ! సౌకర్యాలలో ఉన్న సుఖాన్ని పునః నిర్వచించుకోవాల్సివస్తోందన్నమాట.......నిజానికి ఈ సమస్య ఇప్పటిది కాదు...దీనికి టైమ్ ఫ్రేమ్ ఏది ఉందనుకోను....ఆలోచనవిధానాల తేడా అంతే....పిల్లల మనఃస్తతత్వంలో ఎంతో మార్పు......బావుంది సర్.....మీ వాసుదేవ్

    ReplyDelete
  3. బాగా చెప్పారండి..ఈ కాలపు ప్రతి కొడుకూ గుర్తించాల్సిన విషయం

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...