చిరిగిన కాగితంలో నేనున్నాను
నన్ను చదవకుండా పారేయకండి!
చదవదగిన వాక్యాన్నే నేను
వాక్యమవడం కోసమే నేను బాషలోకి వచ్చాను.
ఇంటిచూరులో గూడుపెట్టుకునేందుకు
పుల్లల్ని ఏరుకునే పిచ్చుకలా
నేను అనుభవాలతో మీకోసం ఇలా
వాక్యపుగూడులా మీ ముందు ఉన్నాను.
నన్ను చూడనైనా చూడకుండా ,తాకనైనా తాకకుండా
వెళ్ళబోకండి..!
అక్షరాన్నో,అక్షరంలా తలకెత్తుకున్న అనుభవాన్నో
కొండలమీంచి దొర్లుతూ వచ్చి
ఈ భూమిని తాకిన శిలనో ,
శిలలోంచి పలకని శిల్పాన్నో ,
నాఊరి గొంతునో,
పొలంలో చిగిర్చేందుకు యత్నిస్తున్న కందిమొట్టునో,
ముడుచుకుపోయి చెట్టునుండి రాలి నిరీక్షిస్తున్న పండునో
ఏమో,
నేనుమాత్రం నాలానే అక్షరంలోంచి తలెత్తి చూస్తున్నాను.
ఒకసారి నావైపు చూసిపొండి..!
చిరిగిన కాగితాల్లోనే
నిజమైన నా జీవితం ఎదురుచూస్తోంది...
#*#
2 . 2 .2002
again .. again..
ReplyDeletetouching the heart
చాలా బావుంది యాకూబ్ గారూ !
ReplyDeleteఇంటిచూరులో గూడుపెట్టుకునేందుకు
ReplyDeleteపుల్లల్ని ఏరుకునే పిచ్చుకలా
నేను అనుభవాలతో మీకోసం ఇలా
వాక్యపుగూడులా మీ ముందు ఉన్నాను
baagundi, yakub!
okkasaari mimmalni choosi vadili polemu sir adantha sulabham kaadu mee kavithvam katti padesthundi.....love j
ReplyDeleteమిత్రమా యాకుబ్ కవి రత్నమా కవిత చిలికించిన తీరు అద్భుతం.
ReplyDeleteChirigina kaagitam is an excellent poem. k.venkata rama krishna
ReplyDelete