నాలోపల దాగిఉన్న పిల్లాడినే నమ్ముతాను
వాడి గుక్కపట్టిన
అల్లర్లూ చిలిపితనాలూ ఆటపాటలూ ఉద్వేగాల్తోనే
నేను పెనవేసుకున్నాను
పిలాడంటే
అతిసున్నితంగా, లేత నవ్వుల్తో
గాలికి సుతారంగా కదిలే పూవులాంటివాడు.
తన బుడిబుడి అడుగుల్తో పార్లాటల్తో
భూమిరుణం తీర్చుకునేందుకు తన్లాడే ఊరులాంటివాడు
మట్టిని అన్నంలా తినేవాడు. గంధంలా పూసుకునేవాడు.
ప్రతి చిన్న కదలికకి అనుభూతికి
కరిగిపోయేవాడు
మనుషుల్ని చూసి చిదానందంగా నవ్వుకునేవాడు
గమన భంగిమల్లో అపురూప కళాఖండంలా కన్పించేవాడు.
ఉగ్గుగిన్నెతో తాగిన అమృతం గురించి
చనుబాల సారంలోంచి అమ్మనేర్పిన ప్రేమ గురించి
లోకం పంచిపెట్టే దుఃఖం గురించి సుఖం గురించి
నాతోనేను మాట్లాడుకుంటున్నప్పుడు
నాలోపలి
ఈ పసివాడే
కవ్వం చేతపట్టుకుని నాలోపల కూచుంటాడు!
*@*
mmm nijangaane manandarilonoo o chantipilla manasu daguntundi danni kadanalemu andunaa meelo adi maree prasputangaa kanipistundi..ade mee aakarshana...aathmeeyatha...prematho ..j
ReplyDeleteExcellent Sir.
ReplyDeleteSriRam
Excellent Yakoob gaaroo...
ReplyDeleteపిల్లాడిలోని పసితనం , బోసినవ్వులు అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. నిష్కల్మషమయిన మనసంత బాగుంది!
ReplyDelete