నీ రక్తం పంచుకు పుట్టనివాడిని
నీ పిల్లాడిలానే ప్రేమించగలవా?
ప్రేమించడం ఒక సాహసం : క్రీడ : అనుభవం.
సాహసం చేసే డింభకుల మాటల్ని
ధైర్యం చేసి వినగలవా?
సాహసం ఒక విలువ : వెలుగు : కొత్త చూపు
అయిష్టమైన ముఖాల్ని తొలగించి
మనుషుల్ని అక్కున చేర్చుకోగలవా?
సుఖాల బారిన పడకుండా
కటిక దుఖం వైపునకు మళ్ళగలవా?
నాలుక చాచి దాహంగా పరుచుకున్న దేహాన్ని
విసర్జించగలవా ఏ మోహమూ లేకుండా..
మోహం ఒక బల్లి: ఒళ్ళంతా గీతలు పెట్టే మంచపు నులక: చిరుచలి
నీ ప్రేమను తుంచేసిన చోటునే
మళ్లీ జీవించగలవా నిర్భయంగా
భారాల దూరాల సంకుచితత్వాల సావాసాల్లో
చెదిరిన అంతరంగం వెక్కిరింతల మధ్య ఉండగలవా?
నీకోసం మిగిలిన శీలాన్ని మానాన్ని సహనంగా స్వీకరించగలవా?
జీవితం ఒక కిటికీ రెక్క
ఎప్పటికీ తెరుచుకునే ఉంటుంది
నిస్సిగ్గుగా అరిచే గొంతుకలా...
బాగుంది
ReplyDeletemachi kavitha uncle
ReplyDeletemany many thanks satya,ro hit
ReplyDeleteకొత్త శిల్పంతో కొత్తవిషయాలు యాకూబ్ జీ...జీవితపు కిటికీ ఎప్పటికీ తెరుచుకునే ఉండడం కవితా దృష్టి, సృష్టి. మీకె సాధ్యం.
ReplyDeleteverrrrrrrryyyyyy niceeee....love j
ReplyDeletetq vasudev,anonymous gaaru!
ReplyDelete