పువ్వుల లోపల నిద్రిస్తున్నవాడికి
ఇంద్రధనుస్సుల అవసరమే రాదు
ఆకుల పచ్చదనాన్ని నింపుకున్నందుకు
చిగురింతల తక్షణత` ఉండదు
మేఘహృదయంతో చెమ్మగిల్లేవాడికి
మళ్లీ మెరుపులా మెరిసే అవసరమే రాదు
స్వచ్చమైన నదిలా ప్రవహించేవాడికి
రాళ్ల అడ్డంకుల్ని నీటిలా దాటడం తెలుసు
నెత్తుటి స్వరమై ఉప్పొంగే వాడికి
బతుకు తడి పరిచయం అనవసరం.
ప్రేమనే నిర్వచించినవాడికి
మళ్లీ గాయాల చరిత్ర గురించి తెలపడం అనవసరం
#*#
nice poem uncle.
ReplyDelete"మేఘహృదయంతో చెమ్మగిల్లేవాడికి
ReplyDeleteమళ్లీ మెరుపులా మెరిసే అవసరమే రాదు"... కవిత చదువుతుంటే ఓ తెలీని భావం చుట్టుముడుతోంది. నిజంగా చాలా బాగుందండీ యాకూబ్‌గారూ...